Skip to content Skip to footer

सर्वे जनाः सुखिनो भवन्तु

सत्यं वद । धर्मं चर

SHODAS’A SAMSKAARAAS

మనం షోడశ సంస్కారాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాంమన ధర్మం లో 48(౪౮సంస్కారాలు ఉన్నాయి.  కానిమనం 40(౪౦సంస్కారాలను మాత్రమే ఆచరిస్తున్నామని గౌతమ మహర్షి   వివరించారు.

మనకి 40 సంస్కారాలు ఉన్నప్పటికీప్రస్తుత కాలం లో కేవలం 16 సంస్కారాలు మాత్రమే ఆచరణలో ఉన్నాయి. వాటిలో కూడా కొన్ని తేడాలు ఉన్నాయి. సంస్కారాలు ఒక శ్లోకం రూపం లో ఉన్నాయని కొంత మంది తెలిపారు.

 

శ్లో .    గర్భాదానం పుంసవనం సీమంతోనయనం తథా

         జాత నామ్నన్నయన్న చౌలాని మౌంజీ వ్రత చతుష్టయం

         గోదానాఖ్యం స్నాతకం  వివాహం పైత్రుమేధికం

         షోడశైతాని కర్మాణి సమంత్రకం కారయేతతః ||

 

షోడశసంస్కారాలు:

1.గర్భాదానం

2.పుంసవనం

3.సీమంతోన్నయనం

4.జాతకర్మ

5.నామకరణం

6.నిష్క్రమణ

7.అన్నప్రాసన

8.చౌల కర్మ/చూడాకర్మ

9.కర్ణవేధ(చెవులు కుట్టటం)

10.అక్షరాభ్యాసం

11.ఉపనయనం

12. సమావర్తనం /స్నాతక వ్రతం

13.అబ్బాయిలకు కేశాంత సంస్కారం  

     13 అ.అమ్మాయిలకు రాజస్వల సంస్కారం

 14. వేదవ్రతం/బ్రహ్మ వ్రతం

15వివాహ సంస్కారం

16.అంత్యేష్టి

ఎక్కువగా అందరం ఆపస్తంభ గృహ్య సూత్రం ఆచరిస్తాము. కాని, కొన్ని  ధర్మ సూత్ర గ్రంధాలు మరియు గృహ్య సూత్ర గ్రంధాలూ కూడా ఆచరణలో ఉన్నాయిఇంకా కొన్ని ధర్మ సూత్ర గ్రంధాలూ కొద్ది పాటి వైవిధ్యం తో కూడా ఉన్నాయి.

షోడశ సంస్కారాలతో మరికొన్ని సంస్కారాలు చేర్చబడ్డాయి. ఇంకా కొన్నింటిలోఇంకొన్ని ధర్మ సూత్రాలలో రెండు మూడు  సంస్కారాలను కలిపి ఒక్క సంస్కారంగా  చేర్చబడింది.

మనము ఇందులో ఆపస్తంభ గృహ్య సూత్రం అనుసరించి షోడశ సంస్కారాలను తెలుసుకుంటాముమనం ఒక్కొక్క సంస్కారాన్ని వివరంగా తెలుసుకుందాము.      అంతకంటే ముందుప్రతిఒక్క సంస్కారం యొక్క సారంశాన్ని విపులంగా తెలుసుకుందాము.      షోడశ సంస్కారాలను మీకు పరిచయం చేసిన తరువాత ముందుకు సాగుదాము.

నిజానికి సంస్కారము అంటే పవిత్రతను లేదా శుద్ది పొందడంశరీరంమనసు,జీవుడుజీవాత్మ ఇవన్ని పవిత్రతను పొందడం అని అర్ధంమన యొక్క గత స్థితి నుండి భవిష్యత్ స్థితికి వెళ్లేందుకు పొందే పవిత్రతను సంస్కరింపబడటం అంటారుషోడశ సంస్కారాలలో ఒక్కో దాని  గురించి గృహ్య సూత్రాలలో  విధంగా చెప్పబడింది:

1.గర్భాదానం:ఇది సంస్కారాలలో మొదటిదివివాహానంతరం వధువు సత్సంతానము పొందడానికే కాక  తన యొక్క గర్భము వేదం మంత్రానుసారం యోగ్యతను సాధించుకునే ప్రక్రియ. నూతన దంపతుల యొక్క మనస్సుశరీరం వేదమంత్ర సహితంగా శుద్ధి పరిచిన అనంతరం వధువు గర్భం దాల్చడానికి అర్హురాలు అవుతుంది ప్రక్రియ లో వధువు ప్రాముఖ్యత వహిస్తుంది.

2.పుంసవనంఇది రెండవ సంస్కారంస్త్రీ గర్భం దాల్చిన మూడవ మాసంలోపుత్ర సంతానం కొరకై చేసే ప్రక్రియ.         

3. సీమంతం:మూడవ సంస్కారం సీమంతం లేదా శ్రీ మంతం అని అంటాము.ఇది తల్లినిబిడ్డను సంరక్షించేందుకు కాక  సునాయాసంగా  ప్రసవం జరగడానికి ఉద్దేశించి చేసే ముఖ్య మైన కర్మగర్భం ధరించిన స్త్రీకి ఆనందం కలిగేలా ఒక పండుగ లా జరప వలసిన కార్యక్రమం.

పైన తెలుపబడిన మూడు సంస్కారాలు శిశువు   జన్మించడానికి  పూర్వం జరుపవలసినవి.

ఇప్పుడు మనము శిశువు జన్మించిన తరువాత చేయవలసిన  కర్మలను తెలుసుకుందాము.

4. జాత కర్మ:ఇది నాలుగవ సంస్కారంశిశువు జన్మించిన తరువాత శిశువుకు చేయవలసిన కర్మ కర్మ శిశువు జన్మించ డానికి కొద్ది సమయం ముందు మొదలై శిశువు జన్మించిన తరువాత పూర్తవుతుంది.

శిశువు యొక్క తండ్రి జాత అశౌచానికి పూర్వం అలాగే  పురిటి స్నానం పూర్తైన తరువాత 11  రోజున కూడా చాల రకాలైన దానాలు చేస్తారు.

5.నామకరణంఐదవ కర్మశిశువుకు పేరుపెట్టే కార్యక్రమంఇది శిశువు జన్మించిన 11 రోజున కాని 21 రోజున కాని జరుపుతారుదీనితో పాటుగాశిశువు తల్లి తండ్రులు శిశువును ఉయ్యాలలో పడుకో పెట్టి జరుపే వేడుక.

6. నిష్క్రమణం:ఆరవ సంస్కారం నిష్క్రమణం.ఇందులో నవ జాత శిశువును  యజ్ఞశాలకు తీసుకువెళ్తారు.శిశువు జన్మించిన తర్వాత మొట్టమొదటి సారిగా బాహ్య ప్రపంచం లోకి తీసుకు వచ్చి బాహ్య జగత్తుకుసమాజానికి మరియు బాహ్య  ప్రకృతికి అలవాటు పడటానికి  కర్మ నిర్వహిస్తారు.

7.అన్న ప్రాసనతల్లి పాలు మినహా  ఇతర ఆహరం తెలియని శిశువుకు సంస్కారం లో శిశువు నాలుకకు పరమాన్నం రుచి చూపిస్తారుదీనితో పాటు గాశిశువు తల్లి తండ్రులు ఒక “వస్తు ప్రదర్శన అనే  వేడుకను చేస్తారు . కొన్ని వస్తువులు పెట్టి శిశువుకు దగ్గరగా పెట్టి,  శిశువు దోగాడుతూ వెళ్లి  వస్తువులను ముట్టుకోవాలి.శిశువు   వస్తువును తాకుతాడో అదే తన భావిష్యత్తు గా వృత్తి నే భవిష్యత్తు లో ఎంచుకుంటాడని అర్ధం.

8.చూడాకర్మ:ఇది ఎనిమిదవ సంస్కారం.దీనిని చౌల సంస్కారం అని కూడా అంటాముపుట్టినప్పుడు శిశువు తలపై ఉన్న వెంట్రుకలను తీసి వేస్తారు.మనం దీన్ని పుట్టు వెంట్రుకలు తీయడం అంటాము.

9.కర్ణవేధకర్ణవేధ తొమ్మిదవ సంస్కారం. కర్ణవేధ అంటే చెవులు కుట్టటం అని అర్ధం. ఈ సంస్కారం, మన పూర్వీకులు చెప్పినట్టుగా,  ఆరోగ్య రీత్యా చాలా ముఖ్యమైనది. చెవులు కుట్టం తో పాటుగా, ఆడపిల్లలకి ముక్కు కూడా కుడతారు.చెవులు కుట్టటం ఆడపిల్లలకి, మగపిల్లలకి కూడా చేస్తారు. ఆడపిల్లలకు మాత్రమే ముక్కు కుడతారు.

10. అక్షరాభ్యాసం: పదవ సంస్కారం అక్షరాభ్యాసం. మొట్టమొదటగా ఉచ్చరించడం  రాయడం నేర్పిస్తారు. ఇది అందరికి అవసరమైన, చాల ఉత్కృష్టమైన సంస్కారం.

11.ఉపనయనం:పదకొండవ సంస్కారం. ఇది చాల శ్రేష్టమైన,నిగూఢమైన సంస్కారం.ఇందులో తండ్రి తన తనయుడికి బ్రహ్మోపదేశ౦ చేస్తాడు, గురువు వటువుకు  యజ్ఞోపవీత ధారణ చేస్తాడు. ఈ సంస్కారం ద్వారా వటువును గురువు/ఆచార్యుని  దగ్గరికి చేర్చి నిజమైన, అలౌకికమైన  జ్ఞానాన్ని గురువు ద్వారా పొందేందుకు తోడ్పడుతుంది.   ఈ సంస్కారం జరిపిన తర్వాత వటువు బ్రహ్మచారిగా మారుతాడు

12. సంవర్తన లేక స్నాతక సంస్కారం: ఈ సంస్కారాన్ని విద్యార్ధి యొక్క  విద్యాభ్యాసం అనంతరం జరుపుతారు.ఈ సంస్కారాన్ని విద్యను బోధించిన ఆచార్యుడు లేక  గురువు కాని జరిపి, వటువు ను బ్రహ్మచర్యం నుండి గృహస్తాశ్రమం స్వీకరించమని ఆజ్ఞాపిస్తారు.

13.కేశాంత సంస్కారం లేక గోదాన వ్రతం: ఇది పదమూడవ సంస్కారం. దీన్ని కేశాంత సంస్కారం లేదా గోదాన వ్రతం అని అంటారు. ఈ సంస్కారాన్ని  అబ్బాయికి  గడ్డం,బుగ్గల మీద వెంట్రుకలు పెరిగిన  తరువాత చేసే కార్యక్రమం. అబ్బాయి గురువు గారికి వత్స సహితంగా గోవును దానం చేయాలి. దీనినే గోదాన వ్రతం అంటారు. ఇటువుంటి కార్యక్రమం ఆడపిల్ల పుష్పవతి అయినప్పుడు కూడా చెయ్యాలి.

14. వేద వ్రతం లేక బ్రహ్మ యజ్ఞం : పద్నాలుగవ సంస్కారం వేద వ్రతం లేక బ్రహ్మ యజ్ఞం అని అంటారు. దీన్ని, వివాహానికి పూర్వం బ్రహ్మచారి గురుకులం లో ఉండగా   చేసే క్రతువు. దీన్ని నాలుగేళ్ళు చెయ్యాలి. ఇందులో గురువు బ్రహ్మచారి తో కొన్ని యజ్ఞాలు, వేద పఠనాలు, వ్రతాలు ఆచరింప చేస్తారు.
 

15.వివాహ సంస్కారం: ఇది వధువు ను వరుని కలిపి గృహస్తాశ్రమం లోకి ప్రవేశి౦ప చేసే ఒక వేడుక . ఇది నాలుగు ఆశ్రమాలోకెల్లా మహోత్క్రుష్టమైనది.

గృహస్తాశ్రమం చాల ముఖ్యమైన ఆశ్రమం.ఈ ఆశ్రమం లో ఉన్న వారు మిగతా మూడు ఆశ్రమాలలో ఉన్న వారిని పోషించాలి. గృహస్తాశ్రమం ద్వారా వంశం నిలబడుతుంది కాబట్టి ఇది ఎంతో పవిత్రమైనది.

16.అంత్యేష్టి:ఇది చివరి సంస్కారం, అంత్యేష్టి సంస్కారం. ఇది స్త్రీ కాని పురుషుడు, తమ దేహం వదిలేశాక వారి పుత్రుడు చేసే కార్యక్రమం.

కావున, మొట్ట మొదటి సంస్కారం అమ్మమ్మ, నాన్నమ్మ , తాతయ్య లు పుట్టబోయే బిడ్డకు చేస్తారు. పిల్లలు పుట్టాక, పసిపిల్లలుగా ఉన్నప్పుడు వారి  తల్లి తండ్రులు వారి ఎదుగుదలకు, ఉన్నతి కొరకై ఇంకొన్ని సంస్కారాలు చేస్తారు.

మరికొన్ని సంస్కారాలను ఆచార్యుడు/గురువు చేస్తారు . చివరి సంస్కారం  కొడుకు చేస్తాడు.

ఇప్పుడు సంస్కారం అంటే ఏంటి? ఎన్ని సంస్కారాలు ఉన్నాయనే విషయాన్నీఒక దాని తరువాత ఒకటి అన్నీ వివరంగా తెలుసుకుందాము.

 ‘సంస్కారం ‘ అనే పదం  “కృ”-“చేయవలసినది” అనే ధాతువు నుండి ఉద్భవించినది .అది “సం-సమ్యక్ –(సరైనది) మంచిది” అనే ఉపసర్గ తో చేరి  “సమ్యక్ కరణమేవ సంస్కరణం”గా అవుతుంది.

సంస్కరణం అంటే మంచి చెయ్యడం. ఎన్నోజన్మలుగా జీవుడి తో పాటు ప్రయాణిస్తూ వస్తున్న పాపాలను, పొరపాట్లను చిత్తము నుండి  తుడిచేసి పవిత్రులను చేసే ప్రక్రియను సంస్కారం అంటారు.

సంస్కారం అనే పదము  ఋగ్వేద మంత్రాలలో మరియు జైమిని పూర్వ మీమాంస లో నే కాక ఇతర సూత్రాలైన  గృహ్య, ఆపస్తంభ సూత్రాలలో కూడా కనిపిస్తుంది.

సంస్కారాలు ఆగమ శాస్త్రాలకు  సంబంధించిన కర్మకాండ. సంస్కారాలు, జీవుడు పుట్టకముందు నుండి మొదలు పెట్టి, జన్మించిన తర్వాత వివిధ దశలలో చేస్తూ,  మనిషి దేహం విడిచాక, తన కుమారుడు చేసే అన్త్యేష్టితో ముగుస్తుంది.

ఈ భూమి మీద ఉన్న 84 లక్షల జీవ రాశులలో ఒక్క మనిషి కి మాత్రమే సంస్కారాలు జరుపబడుతాయి. ఎందుకంటే మానవ జీవితము, మానవ దేహము ఎంతో ఉన్నతమైనది, ఉత్కృష్టమైనది.

కేవలం మానవ ఉపాధి లో మాత్రమే మోక్షం పొందగలము. ఒక వేళ జీవుడు పక్షి గానో లేక జంతువు గానో జన్మించినట్లైతే అవి కేవలం ఆ ఉపాధికి సంబంధించిన పాప పుణ్యాలను మాత్రమే అనుభవిస్తాయి.